
తమిళ సినిమా: ప్రఖ్యాత దివంగత సినీ దర్శకు డు సత్యజిత్ రే శత జయంతిని పురస్కరించుకొని చెన్నైలో మూడు రోజులపాటు సత్యజిత్ రే చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఎన్.ఎఫ్.డి.సీ (నే షనల్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చిత్రోత్సవాలు సోమవారం స్థానిక అడయార్, ఆర్.ఏ.పురంలోని ఠాగూర్ ఫిలిం సెంటర్ ఆవరణలో నిర్వహిస్తున్నారు.
నటి అర్చన ముఖ్యఅతిథిగా పాల్గొ ని ద్వీప ప్రజ్వలన చేసి చిత్రోత్సవాలను ప్రారంభించారు. ఇందులో ఎన్.ఎఫ్.డి.సీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేష్ ఖన్నా, రీజనల్ హెడ్ రోహిణి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రోత్సవాలు సోమవారం నుంచి మూడు రోజులపాటు జరగ నున్నాయి. ఇందులో సత్యజిత్ రే వెండితెరపై చె క్కిన అజరామర చిత్రాలను ప్రదర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment