‘కచడ కచడ హో గయా... అర్థమైత లేదయా'... | Sehari telugu movie title song launch | Sakshi
Sakshi News home page

‘కచడ కచడ హో గయా... అర్థమైత లేదయా'...

Published Tue, Jun 8 2021 1:46 AM | Last Updated on Mon, Sep 20 2021 12:07 PM

Sehari telugu movie title song launch - Sakshi

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మించారు. ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందించిన ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను ఆవిష్కరించారు. ‘కచడ కచడ హో గయా... అర్థమైత లేదయా, నేను ఆడాలన్నా పాడాలన్నా జిందగీలో లేదే సెహరి...’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రం రూపొందుతోంది. టైటిల్‌ సాంగ్‌ని భాస్కరభట్ల రాయగా రామ్‌ మిరియాల పాడారు. యశ్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో హర్ష్‌ డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ అదిరిపోయాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌  వర్క్స్‌ జరుపుకుంటున్న మా చిత్రం త్వరలోనే విడుదల కానుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అభినవ్‌ గోమఠం, ప్రణీత్‌ రెడ్డి, బాలకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అరవింద్‌ విశ్వనాథ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement