Trinayani Actress Ashika Padukone Married To Business Man Chethan - Sakshi
Sakshi News home page

Ashika Padukone : బిజినెస్‌ ‍మ్యాన్‌తో నటి ఆషికా వివాహం..లైవ్‌లో స్ర్టీమింగ్‌

Published Tue, Oct 19 2021 10:15 AM | Last Updated on Tue, Oct 19 2021 12:35 PM

Serial Actress Ashika Padukone Married To Business Man Chethan - Sakshi

Serial Actress Ashika Padukone Married To Business Man Chethan: ప్రియుడు, బిజినెస్‌ మ్యాన్‌ చేతన్‌ శెట్టితో బుల్లితెర నటి ఆషికా పదుకొణె వివాహం జరిగింది. కుటుంబసభ్యులు, ఇండస్ర్టీకి చెందిన కొద్ది మంది స్నేహితుల సమక్షంలో సోమవారం(అక్టోబర్‌ 18)న వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా గతేడాది బెంగళూరులోని ఓ హోటల్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

చేతన్‌ తనకు బాగా తెలుసని, లాక్‌డౌన్‌లో తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆషికా ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. పెళ్లి తర్వాత కూడా తాను సీరియల్స్‌లో నటిస్తానని స్పష్టం చేసింది. కాగా  క‌థ‌లో రాజ‌కుమారి సీరియ‌ల్ ద్వారా తెలుగు వారికి పరిచ‌యం అయిన ఆషికా..తొలి సీరియల్‌తోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. సోషల్‌ మీడియాలోనూ ఈమెకు మాంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం ఆషికా త్రినయని అనే సీరియల్‌లో నటిస్తుంది. 

చదవండి: రవి అలాంటి వాడు..విశ్వ పైకి అలా కనిపిస్తాడు కానీ!: అలీ రెజా
అనసూయ డ్రెస్సింగ్‌పై వివాదాస్పద కామెంట్స్‌ చేసిన కోట శ్రీనివాసరావు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement