![Shanmukh Jaswanth Meets His Favourite Hero Suriya, Share Emotional Post - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/4/shanmukh-jaswanth.jpg.webp?itok=tvNNszQD)
ఒకరకంగా చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. బిగ్‌బాస్ షోలో ఆఫర్ వచ్చిందని సంబరపడేలోపు ఆ రియాలిటీ షో ద్వారా ఎంతో నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. సిరికి పదేపదే హగ్గులిస్తూ మితిమీరి ప్రవర్తించాడని అభిమానులు సైతం ఫైర్ అయ్యారు. ఏదేమైనా కప్పు కొట్టే బయటకు వస్తాడనుకుంటే విపరీతమైన ట్రోలింగ్ వల్ల ట్రోఫీకి అడుగు దూరంలో ఆగిపోయి రన్నరప్‌గా నిలిచాడు. ఇక షో నుంచి బయటకు వచ్చాక దీప్తి సునయన బ్రేకప్ చెప్పడంతో అతడి గుండె ముక్కలైంది. ఎప్పటికైనా మళ్లీ కలుస్తామని ఆశతో బతుకుతున్నాడు షణ్ను.
ఇలా వరుస ఫెయిల్యూర్ల మధ్య కొట్టుమిట్టాడుతున్న షణ్ముఖ్ తన కల నెరవేర్చుకున్నాడు. తన ఫేవరెట్ హీరో సూర్యను కలిశాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈటీ ప్రీరిలీజ్ ఈవెంట్ లాంచ్‌లో సూర్యను కలిసే ఛాన్స్ దక్కించుకున్న షణ్ను తన హీరోను నేరుగా చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 'మార్చి 3 చాలా సంతోషకరమైన రోజు. కొన్ని నెలలుగా ఎన్నో ఫెయిల్యూర్స్ చూసిన నేను ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుబ్బు, మనోజ్‌లకు ధన్యవాదాలు, ఐ లవ్ యూ సూర్య అన్న' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో హీరో సూర్య షణ్నును చూసి అతడి దగ్గరకు నడుచుకుంటూ వచ్చి హగ్ ఇచ్చి మనసారా మాట్లాడాడు. నువ్వు కోరుకుంది జరగకపోవచ్చేమో కానీ నీకు కావాల్సింది తప్పకుండా జరిగి తీరుతుంది అని మరో వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు షణ్ను.
Comments
Please login to add a commentAdd a comment