TV Serial Actress Rupali Ganguly Shocking Remuneration: హిందీ సీరియల్స్ వీక్షించేవారికి రూపాలీ గంగూలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడాదిన్నరగా టీఆర్పీలో దూసుకుపోతూ తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్న ఏకైక సీరియల్ అనుపమ. ఇందులో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వాటికి ఎదురీదుతున్న గృహిణి అనుపమగా అదరగొడుతోంది బుల్లితెర నటి రూపాలీ గంగూలీ.
మరి ఈ సీరియల్‌లో నటించినందుకు రూపాలీకి ఎంతొస్తుందో తెలుసా? అక్షరాలా లక్షన్నర రూపాయలు. ఇదంతా నెలకో, వారానికో కాదు.. కేవలం ఒక్కరోజు షూటింగ్‌లో పాల్గొన్నందుకే ఆమె ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటుందట. రోజురోజుకీ తన పాత్రకు ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గకపోవడంతో తన రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేసిందట. అంటే ప్రస్తుతం ఆమె ఒక్క రోజుకే మూడు లక్షలు తీసుకుంటున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
పారితోషికంలో తగ్గేదేలే అంటున్న రూపాలీ.. రామ్ కపూర్, రోణిత్ బోస్ రాయ్ వంటి వారిని సైతం వెనక్కి నెట్టి మరీ బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా రికార్డుకెక్కింది. కొన్ని నెలల క్రితమే తన పారితోషికాన్ని పెంచినట్లు టాక్ వినిపిస్తుండగా ఆమె నటనకు ఆమాత్రం ఇవ్వడంలో తప్పే లేదంటున్నారు ఆమె అభిమానులు. కాగా రూపాలీ గంగూలీ గతంలో హిందీ బిగ్‌బాస్ 1లో పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment