హీరోయిన్ శ్రియ శరన్ క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రియ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ మూవీలో కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్‌లో శర్మన్ జోషితో కలిసి మ్యూజిక్ స్కూల్ చిత్రంలోనూ నటిస్తోంది. అయితే గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియ.. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కాస్త గట్టిగానే కౌంటరిచ్చింది. పెళ్లయ్యాక కూడా మీరు అందంగా ఉండడానికి కారణం ఏంటని ఆమె శ్రియా శరణ్‌ను ప్రశ్నించింది. దీనిపై స్పందిస్తూ హీరోయిన్లను మాత్రమే ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు?.. ఇలాగే హీరోలను అడిగే ధైర్యం మీకుందా' అని అంటూ ప్రశ్నించింది.
(ఇది చదవండి: 20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్!)
శ్రియ మాట్లాడుతూ.. 'నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను మెచ్చుకున్నారు. బిడ్డ పుట్టాక కూడా మీరు ఇంత అందంగా ఉన్నారంటే నమ్మలేకపోతున్నాం అని చెప్పారు. కానీ ఇక్కడ అందం ఒక్కటే ముఖ్యం కాదు. నా వయసు ఎంత? నేను ఇండస్ట్రీలో ఎంత కాలం నుంచి ఉన్నాను? అనేదే ముఖ్యం. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు లేదు. ఈ ప్రశ్న ఇండస్ట్రీలోని హీరోలను అడిగిన రోజున నేను దీనికి సమాధానం చెబుతా.' అంటూ శ్రియ బదులిచ్చింది. ఆ తర్వాత జర్నలిస్ట్ స్పందిస్తూ ఈ విషయంలో నిజంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను అంటూ కొనియాడింది.
శ్రియ సమాధానంపై నెటిజన్స్ కూడా స్పందించారు. శ్రియ చాలా ముక్కుసూటిగా మాట్లాడిందని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను ఓ నెటిజన్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. శ్రియ 2018లో ఆండ్రీ కొస్చీవ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. ఆ తర్వాత శ్రియ గమనం, ఆర్ఆర్ఆర్ , తడ్కా, దృశ్యం-2లో కనిపించింది. ఈ ఏడాది కన్నడ చిత్రం కబ్జాలో కూడా నటించింది.
(ఇది చదవండి: PS2 Collections: రెండు రోజుల్లో వందకోట్లు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం!)
Comments
Please login to add a commentAdd a comment