
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలతో పాటు వరుస అవార్డులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే శాటర్న్, సన్‌నెట్ సర్కిల్ వంటి అంతర్జాతీయ అవార్డులను సాధించిన హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ది న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వరించింది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన రాజమౌళికి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ఉత్తమ దర్శకుడి అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ దర్శకుడిగా రాజమౌళి సరికొత్త రికార్డు సృష్టించాడు.
అయితే ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో రాజమౌళి ఆరోగ్య సమస్యతో సతమతమయ్యాడట. ఈ విషయాన్ని హీరోయిన్ శ్రియ ఇటీవల మీడియాకు వెల్లడించింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి ఆస్తమాతో ఇబ్బంది పడ్డారు. అజయ్ దేవ్‌గణ్, నా కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ సమయంలో దుమ్ము కారణంగా చాలా ఇబ్బందిపడ్డాడు. అయినా సరే, కథను ఎంత బాగా ప్రజెంట్ చేయాలనే ఆలోచించారు. సెట్ అంతా దుమ్ము ఉన్నా అలానే పని చేశారు. సినిమా బాగా రావాలని రాజమౌళి ఎంతగానో కష్టపడతారు అని చెప్పుకొచ్చింది.
చదవండి: టికెట్ టు ఫినాలే గెలిస్తే ఓడిపోవడం ఖాయమా?
మహేశ్‌బాబు అలా అనేసరికి ఏడ్చేశాను: అడివి శేష్
Comments
Please login to add a commentAdd a comment