
Shruthi Haasan Reveals Secrets About Her Relationship: హీరోయిన్ శృతీ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శృతీ పాపులర్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం శాంతను హజారిక అనే చిత్రకారుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన శృతి తరుచూ అతడితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కపుల్ గోల్స్ పేరిట క్విజ్‌లో పాల్గొన్న ఈ జంట పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. అందులో ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు అన్న ప్రశ్నకు..నేను అంటూ శృతీ సమాధానం చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్‌తో కలిసి సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment