Singer Lisa Gentile: Accusing Chris Noth Of Sexual Assault - Sakshi
Sakshi News home page

వద్దంటే రెచ్చిపోయాడు, ముద్దులు పెడుతూ అసభ్యంగా తాకుతూ..

Published Fri, Dec 24 2021 9:33 PM | Last Updated on Sat, Dec 25 2021 1:50 PM

Singer Lisa Gentile Accusing Chris Noth Of Sexual Assault - Sakshi

Chris Noth: హాలీవుడ్‌ సీనియర్‌ నటుడు క్రిస్‌ నాత్‌పై సంచలన ఆరోపణలు చేసింది సింగర్‌ లీసా జెంటిల్‌. క్రిస్‌ తనను లైంగికంగా వేధించాడని, ఈ విషయం బయటకు చెప్తే తన జీవితం నాశనం చేస్తాడని బెదిరించాడని వాపోయింది. ఈ సంఘటన 2002లో జరిగిందని పేర్కొంది. '1998లో న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్‌లో క్రిస్‌ను తొలిసారి కలిశాను. సంగీతం, బిజినెస్‌ గురించి మాట్లాడుకునేవాళ్లం. అలా 2002 సంవత్సరం ప్రారంభంలో ఓరోజు రాత్రి అతడు నన్ను రెస్టారెంట్‌ నుంచి ఇంటిదగ్గర దింపుతానన్నాడు. సరే అనడంతో అతడు ఇంటిదగ్గర డ్రాప్‌ చేశాడు. ఇల్లు చూడాలని ఉందంటే లోపలకు రమ్మన్నాను. అంతే.. అతడు వెంటనే నన్ను బలవంతంగా తనదగ్గరకు లాక్కుని ముద్దులు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు'

'నేను అతడిని ఆపేందుకు ప్రయత్నించేకొద్దీ మరింత రెచ్చిపోయాడు. బలవంతంగా నా చేతులను తన షర్ట్‌లోపలకు పోనిచ్చాడు. నేను నా శక్తినంతా ఉపయోగించి అతడిని నెట్టివేశాను. నాకిదంతా ఇష్టం లేదు అని అరిచి మరీ చెప్పడంతో క్రిస్‌ నన్ను నోటికొచ్చినట్లు తిట్టి అపార్ట్‌మెంట్‌ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడు. నా కెరీర్‌ను ఎక్కడ నాశనం చేస్తాడోనన్న భయంతో ఇన్నాళ్లు ఈ విషయం బయటకు చెప్పలేదు' అని తెలిపింది. ఇక ఈ మధ్యే మరో నలుగురు మహిళలు సైతం క్రిస్‌ నాత్‌ తమను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపించడం గమనార్హం. అయితే నాత్‌ మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement