![Singer Revanth Said He Will Win Bogg Boss 6 Telugu Title Shares Post - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/3/revanth1.jpg.webp?itok=OfWy0poB)
హౌజ్‌లో ఇంకా అడుగు పెట్టకుండానే టైటిల్ నాదే అంటూ ధిమా వ్యక్తం చేశాడు సింగర్ రేవంత్. అయితే అందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ తాజాగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ 6వ సీజన్ రేపు గ్రాండ్‌గా లాంచ్ కాబోతుంది. హౌజ్‌లో అడుగుపెట్టేది వీరేనంటూ కంటెస్టెంట్ ఫైనల్ లిస్ట్ ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఈ జాబితాలో ఇండియన్ ఐడల్ విజేత సింగర్ రేవంత్ ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి: పవన్ కల్యాణ్‌కి విషెస్ చెప్పని బన్నీ, కారణమిదేనా?
తాజాగా ఇదే విషయాన్ని కన్‌ఫాం చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ షేర్ చేశాడు రేవంత్. ‘జీవితంలో కొన్నింటిని త్యాగం చేయడం చాలా కష్టం... నా కుటుంబాన్ని మిస్ అవుతాను. ముఖ్యం నా భార్యను అలాగే నా సంగీతాన్ని. కానీ ఓ భగీరథుడి సాధనలా గెలిచి మంచి పేరుతో బయటికు వస్తాను. త్వరలోనే మీ అందరి కలుసుకుంటా. ఓటింగ్స్ ద్వారా మీ అందరి ప్రేమ, మద్దతు కావాలి. మీ అందరిని అలరించేందుకు చివరి రంగం సిద్ధమైంది. మీ అందరి ప్రేమ, ఆశ్వీర్వాదంతో టైటిల్ గెలిచి వస్తాను’ అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసి అతడి ఫ్యాన్స్ ‘ఆల్ ది బెస్ట్’ అంటూ రేవంత్‌ని విష్ చేస్తున్నారు.
చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి
కాగా బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులతో ఎలాంటి కాంటాక్ట్ కానీ, అసలు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మూడు నెలల పాటు హౌజ్‌లో ఉండాలనేది బిగ్‌బాస్ రూల్. అంతేకాదు హౌజ్‌లో అడుగుపెట్టేవరకు కంటెస్టెంట్స్ ఎవరూ తాము బిగ్‌బాస్ ఆఫర్ అందుకున్న విషయాన్ని బయటకు లీక్ చేయొద్దు. అది బిగ్‌బాస్ రూల్. కానీ రేవంత్ ఇంకా బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టకుండానే అఫిషియల్‌గా పోస్ట్ షేర్ చేయడం అందరిని ఆశ్యర్యపరుస్తోంది. మరి ఇది బిగ్‌బాస్ పర్మిషన్‌తోనే చేశాడా? లేక ఆత్రుత ఆగలేక తొందరపడి పెట్టేశాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment