రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చిన శోభితా ధూళిపాళ్ల | Sobhita Dhulipala stunning look at Telangana Gaddar Film Awards | Sakshi
Sakshi News home page

రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చిన శోభితా ధూళిపాళ్ల

Mar 21 2026 9:01 AM | Updated on Mar 21 2026 10:42 AM

Sobhita Dhulipala stunning look at Telangana Gaddar Film Awards

అక్కినేని కుటుంబంలో వారసుడు రాబోతున్నాడు.. నాగచైతన్య తండ్రి కాబోతున్నాడు అంటూ కొద్దిరోజుల క్రితం సోషల్‌మీడియాలో  వార్తలు వచ్చాయి. ఈ గాసిప్స్‌ రావడానికి కూడా పలు కారణాలు ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో ఎలాంటి వేడుక జరిగినా సతీసమేతంగా  నాగచైతన్య వెళ్తాడు.  శోభితా ధూళిపాళ్లతో పెళ్లయిన తర్వాత దాదాపు అన్ని కార్యక్రమాలకు ఇద్దరూ కలిసే హాజరయ్యారు. కానీ, రీసెంట్‌గా జరిగిన అల్లు శిరీశ్ పెళ్లితో పాటు విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్‌లో చైతూ ఒక్కడే కనిపించడంతో  శోభిత తల్లి కాబోతుందని వార్తలు వచ్చాయి.

శోభిత ప్రెగ్నెన్సీ రూమర్లకు తాజాగా ఫుల్ స్టాప్ పెట్టింది. ఉగాది నాడు జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకకు భర్తతో కలిసి  శోభిత హాజరైంది. అయితే, రూమర్స్‌ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఊహాగానాలకు మరో ఛాన్స్‌ ఇవ్వకుండా పల్చటి చీరతో కనిపించింది. అలా డ్రెస్‌ సెన్స్‌తో శోభిత క్లారిటీ ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో ప్రెగ్నెన్సీ వార్తలన్నీ రూమర్స్‌ మాత్రమే అని తేలిపోయింది. 2024 డిసెంబర్‌లో నాగచైతన్య-శోభిత పెళ్లి జరిగింది. 

ఆ తర్వాత చైతూ నటించిన తండేల్‌ సూపర్‌ హిట్‌ కావడం ఇప్పుడు ఉత్తమ నటుడిగా అవార్డ్‌ అందుకోవడంతో శోభితతో పాటు లక్‌ కూడా తన జీవితంలోకి వచ్చిందని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. ఒక ఈవెంట్‌లో నాగార్జున కూడా ఇలాంటి వార్తలపై రియాక్ట్‌ అయ్యారు తమ కుటుంబంలో ఏవైనా  శుభవార్తలు ఉంటే.. తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement