ముంబై : కలియుగ కర్ణుడు, నటుడు సోనూసూద్ మరో సారి తన మంచితనాన్ని చాటుకున్నారు. వర్షాల కారణంగా ఇళ్లు, పుస్తకాలు కోల్పోయిన బాలికకు బాసటగా నిలిచారు. గత కొద్దిరోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఛత్తీస్‌ఘర్‌లోని మావోయిస్టు ప్రభావిత జిల్లా బిజాపూర్, బస్తర్‌లోని అంజలి అనే బాలిక ఇళ్లు కూలిపోయింది. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోయాయి. తన పుస్తకాలు కూడా తడిచి పాడయ్యాయి. దీంతో బాలిక కన్నీరు మున్నీరుగా విలపించింది. దీన్నంతా వీడియో తీసిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా సోనూ దృష్టికి వచ్చింది. (మెసేజ్ చూడకపోతే క్షమించండి : సోనూసూద్)
బుధవారం ట్విటర్ ద్వారా స్పందించిన ఆయన ‘‘ కన్నీళ్లు తుడుచుకో చెల్లెలా. ఇళ్లు కొత్తదవుతుంది.. పుస్తకాలు కూడా కొత్తవవుతాయి’’ అని పేర్కొన్నారు. ఫేస్‌బుక్ వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి భూపేశ్ భగెల్ సైతం బాలిక కుటుంబానికి సహాయం చేయవల్సిందిగా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే అంజలి కుటుంబాన్ని పరామర్శించి ఇంటి నిర్మాణం కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.
आंसू पोंछ ले बहन...
— sonu sood (@SonuSood) August 19, 2020
किताबें भी नयीं होंगी..
घर भी नया होगा। https://t.co/crLh48yCLr
Comments
Please login to add a commentAdd a comment