పాపం! సోనూ సూద్‌ ఇంత బిజీనా.. | Sonu Sood Satirical Reply To Netizen Gone Viral | Sakshi
Sakshi News home page

పాపం! సోనూ సూద్‌ ఇంత బిజీనా..

Published Sat, Aug 15 2020 3:44 PM | Last Updated on Sat, Aug 15 2020 7:26 PM

Sonu Sood Satirical Reply To Netizen Gone Viral - Sakshi

కలియుగ కర్ణుడు సోనూ సూద్‌ దాన గుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేతికి ఎముక లేకుండా సహాయం చేస్తుంటారాయన. ఈ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న వారు ఆయన్ని సహాయం కోరటం పరిపాటిగా మారింది. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఆయన్ని ఆటపట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు. తమ సిల్లీ సమస్యల్ని తీర్చాలంటూ సెటైరిక్‌గా పోస్టులు చేస్తున్నారు. వాటిపై అంతే సెటైరిక్‌గా స్పందిస్తున్నారు సోనూ. ప్రస్తుతం మంజు శర్మ అనే నెటిజన్‌ చేసిన ఓ ట్వీట్‌.. దానికి సోనూ స్పందన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘  సోనూ సూద్‌! నా మొబైల్‌లో ఇంటర్‌ నెట్‌ స్పీడ్‌ దారుణంగా ఉంది. దాన్ని పెరిగేట్లు చేయవా’’ అంటూ మంజు శర్మ ట్వీట్‌ చేసింది. ( నేను హీరోను కాదు.. కేవలం: సోనూ సూద్‌ )
 

దానిపై స్పందించిన సోనూ.. ‘‘  రేపటి ఉదయం వరకు మీరు కొద్దిగా ఆగండి! నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నా.. ఓ వ్యక్తి కంప్యూటర్‌ రిపేర్‌ చేస్తున్నా.. వివాహ సమస్యలు, ట్రైన్‌ టిక్కెట్లు బుక్‌ చేయటం, ఇళ్లకు సంబంధించిన నీటి సమస్యలు తీర్చటం వంటివి. కొంతమంది మహానుభావులు నాకిలాంటి గొప్పగొప్ప పనులు చెబుతున్నారు. దయ చేసి అర్థం చేసుకోండి!! ’’ అని పేర్కొన్నారు. దీనిపై సందిస్తున్న నెటిజన్లు ‘‘ సోనూ సూద్‌ చాలా గజి‘‘బిజీ’’  పాపం! సోనూ ఇంత బిజీనా..’’అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement