
‘రియల్ హీరో’, ప్రముఖ నటుడు సోనూసూద్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీటర్ ద్వారా వెల్లడించారు. ‘ఈ రోజు ఉదయం కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని తేలింది. ముందుజాగ్రత్తగా చర్యగా నేను ఇప్పటికే సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎవరూ ఆందోళన చెందవద్దు. దీనివల్ల మీ సమస్యల పరిష్కారం కోసం నాకు చాలా సమయం దొరుకుతుంది. నేను మీ అందరివాడిని అనే విషయం గుర్తుపెట్టుకోండి’అని సోనూసూద్ ట్వీట్ చేశాడు.
గతేడాది కరోనా విపత్కర పరిస్థితుల్లో సోనూసూద్ వేలాది మందికి సాయం అందించాడు. వలస కార్మికులను స్వస్థలాలకు చేరవేసి ఎందరో పాలిట దేవుడిగా మారాడు నటుడు సోనూసూద్. కష్టాల్లో ఉన్న చాలామందికి ఆర్థిక సాయం చేస్తూ రియల్ హీరోగా పేరు గాంచాడు. సోనూసూద్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులంతా సోషల్ మీడియాలో ప్రార్థిస్తున్నారు. కాగా, సోనూసూద్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు.
— sonu sood (@SonuSood) April 17, 2021
Comments
Please login to add a commentAdd a comment