'చాలా బాగుంది' హీరోయిన్ ఎలా మారిపోయిందో చూశారా? | South Actress Malavika Shares Her Yoga Photos, Reveals Her Fitness Secret | Sakshi
Sakshi News home page

44 ఏళ్ల వయసులో ఫిట్‌గా స్టార్‌ హీరోయిన్‌.. నన్ను నమ్మండంటూ పోస్ట్‌

Published Fri, Mar 1 2024 4:44 PM | Last Updated on Fri, Mar 1 2024 5:47 PM

South Actress Malavika Shares Her Yoga Photos, Reveals Her Fitness Secret - Sakshi

శ్వేత కొన్నూర్‌ మీనన్‌.. ఈ పేరు చెప్పగానే ఎవరబ్బా అనుకునేరు? హీరోయిన్‌ మాళవిక అసలు పేరిది! 19 ఏళ్ల వయసులోనే ఉన్నాయ్‌ తేడి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్‌ సినిమాతోనే బ్లాక్‌స్టర్‌ కొట్టింది. రోజావనం మూవీతో తన సత్తా నిరూపించుకుంది. ఇంకేముంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ రారమ్మని పిలిచింది. చాలా బాగుంది సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. దీవించండి, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తం, అప్పారావు డ్రైవింగ్‌ స్కూల్‌ సినిమాలతో తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందింది.

రీఎంట్రీకి సిద్ధం
తెలుగు, తమిళంతోపాటు మలయాళ, హిందీ, కన్నడ సినిమాలు కూడా చేసింది. 2009లో చివరగా ఆరుపాడై సినిమా చేసింది. అందులో అతిథి పాత్రలో కనిపించింది. 2007లో సుమేష్ మీనన్‌ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్‌ అయింది. చాలాకాలానికి గోల్‌మాల్‌ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. 44 ఏళ్ల వయసులోనూ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటోందీ బ్యూటీ.

మరింత బలంగా మార్చుతుంది
తాజాగా తన సోషల్‌ మీడియాలో యోగా చేస్తున్న ఫోటోను షేర్‌ చేసింది. ఈ జర్నీ అంత సులువేం కాదు.. కానీ యోగా పట్ల నీకు ఎంత నిబద్ధత ఉందనేది తెలుస్తుంది. రోజూ యోగా మ్యాట్‌ నేలపై పరచడమనేది మొక్కకు నీళ్లు పోయడంలాంటిది. ఇది మిమ్మల్ని మరింత బలంగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చుతుంది. కఠినతరమైన పరిస్థితుల్లో కూడా ఒక్కసారి యోగా చేసి గాఢంగా శ్వాస తీసుకుంటే అది మీ పురోగతికి ఉయోగపడుతుంది.

నన్ను నమ్మండి..
ఒక్కసారి కమిట్‌ అయ్యాక దాన్ని వదిలేయకూడదు.. కట్టుబడి ఉండాలి. ప్రాక్టీస్‌ కొనసాగిస్తూనే ఉండాలి. అప్పుడు వచ్చే సానుకూల మార్పులను మీరే చూస్తారు. నన్ను నమ్మండి.. ఇదే నిజం అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. కాగా మాళవిక.. తరచూ తన వర్కవుట్‌, యోగా వీడియోలు, ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది.

చదవండి: ఆ సినిమాలో నేనూ హీరోయిన్‌నే.. కానీ నన్ను తీసేశారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement