
దర్శకుడిగా రాజమౌళి ఎంతటి పర్‌ఫెక్షనిస్టో ఆయన సినిమాల్లోని విజువల్స్ చెబుతాయి. టేకింగ్, మేకింగ్‌లో అస్సలు రాజీపడరు రాజమౌళి. అలాగే హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటనలో రాజీపడరు. ఇటీవల ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) సినిమాలోని ఓ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ విషయంలో ఈ ఇద్దరూ ఏమాత్రం రాజీపడలేదట. రాజమౌళి విజన్‌కి తగ్గట్లే ఈ సీన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ అనిపించారట.
ఈ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్స్‌లో ఆడియన్స్‌కు మరింత కిక్ ఇస్తాయన్నది ఇండస్ట్రీ టాక్. ఆల్రెడీ సినిమాలో తారక్‌కీ, పులికీ మధ్య ఓ ఫైట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ తెరపైకి వచ్చింది. ఇక ‘ఆర్‌ఆర్ ఆర్’లో రామ్‌చరణ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న ఈ సినిమా అక్టోబరు 13న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment