ఆర్‌ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఎక్కడకు వెళ్లినా దుమ్ము దులుపుతోంది. థియేటర్లలో ఉన్నన్ని రోజులు కలెక్షన్లతో కిక్కిచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ ఇప్పుడు అవార్డుల మీద అవార్డులు అందుకుంటోంది. ఒక్క ఆర్‌ఆర్‌ఆరే కాదు పుష్ప, కేజీఎఫ్ 2, కాంతార, కార్తికేయ 2, విక్రమ్.. ఇలా దక్షిణాది నుంచి బోలెడన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్‌లో ఘన విజయం సాధించాయి. మరోవైపు భారీ స్థాయిలో రిలీజైన బాలీవుడ్ సినిమాలు మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడ్డాయి. ఇందుకు కారణమేమై ఉంటుందనే విషయాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి బయటపెట్టాడు.
తాజా ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ.. 'బాలీవుడ్‌లోకి కార్పోరేట్లు అడుగుపెట్టారు. అప్పటినుంచి నటీనటులకు, దర్శకులకు ఎక్కువ రెమ్యునరేషన్లు ఇవ్వడం మొదలైంది. ఎలాగోలా చేతికి డబ్బు వస్తుండటంతో ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న కసి కొంత తగ్గింది. అందువల్లే బాలీవుడ్‌లో సినిమాలు విజయం సాధించలేకపోతున్నాయి. సౌత్‌లో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ గెలుపు కోసం కచ్చితంగా ఈదాల్సిందే లేదంటే ముగినిపోవాల్సిందే! ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమ బాగా రాణిస్తోంది. కాకపోతే సినిమా అనౌన్స్‌మెంట్‌కు వచ్చిన ఆదరణ చూసో, అప్పటిదాకా జరిగిన బిజినెస్ చేసో ఆత్మసంతృప్తి చెందకుండా ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకు వచ్చేంతవరకు కృషి చేస్తూనే ఉండాలి. అప్పుడే సక్సెస్ సొంతమవుతుంది' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: ఈ ఏడాది టాప్ 10 సినిమాలివే, అగ్రస్థానంలో ఆర్‌ఆర్‌ఆర్
Comments
Please login to add a commentAdd a comment