న్యూఢిల్లీ: ‘ఎంఎస్ ధోని’ బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అద్భుతంగా నటించి కొట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్‌నే కాక యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై సీబీఐ( కేంద్ర దర్యాప్తు సంస్థ) ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. అయితే భవిష్యత్తులో సుశాంత్ చేయాలనుకున్న సినిమాలను ఆయనే స్నేహితులు ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నారు. అయితే ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణలో భాగంగా సుశాంత్ వ్యాపార సహచరుడు(పార్ట్‌నర్), వరుణ్ మాథూర్ కీలక విషయాలను వెల్లడించాడు. వరణ్ తెలిపిన వివరాల ప్రకారం ధోని బయోపిక్‌తో ఊపు మీదున్న సుశాంత్ సౌరవ్ గంగూలీ బయోపిక్‌ను తన సోంత నిర్మాణ సంస్థలో నిర్మించాలనుకునేవాడని తెలిపాడు.
కాగా సౌరవ్ బయోపిక్ సుశాంత్‌కు కళల(డ్రీమ్) ప్రాజెక్ట్ అని తెలిపాడు. అయితే సౌరవ్ బయోపిక్ మాత్రమే కాకుండా సుశాంత్ మదిలో 12 దిగ్గజ వ్యక్తుల బయోపిక్‌లు (స్వామి వివేకానంద, మదర్ తెరెసా, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ) జీవిత చరిత్రలను నిర్మించాలనే ఆలోచన చేసేవాడని వరుణ్ మాథూర్ పేర్కొన్నాడు. అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తితో పాటు ఆమె తండ్రి, సోదరుడు షోవిక్ చక్రవర్తిని సీబీఐ విచారించింది. ఇక రియాపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈడీ ఎదుట కూడా హాజరైన విషయం తెలిసిందే. చదవండి: సుశాంత్ మృతి కేసు: ఆయన తండ్రి ఏం చెప్పారు?
Comments
Please login to add a commentAdd a comment