
తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు టీఎస్ బాలయ్య తనయుడు జూనియర్ బాలయ్య(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. జూనియర్ బాలయ్య మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరీ జూనియర్ బాలయ్య?
జూనియర్ బాలయ్య అసలు పేరు రఘు బాలయ్య. ఆయన తండ్రి టీఎస్ బాలయ్య కోలీవుడ్‌లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రిలోని నటనను పుణికి పుచ్చుకున్న జూనియర్ బాలయ్య మేల్నట్టు మరుమాల్ సినిమాతో వెండితెరకు నటుడిగా పరిచయమయ్యారు. త్యాగం, హబే మాయం, గంగై అమరన్, అమ్మ వండచు, రాసుకుట్టి వంటి చిత్రాల్లోనూ ముఖ్య పాత్రలో నటించారు.
సత్తై మూవీతో బాగా క్లిక్ అయ్యారు. సుందరకాండం, తని ఒరువన్, పులి, నేర్ కొండ పార్వై వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. అప్పుడప్పుడూ బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలోనూ పాల్గొని సందడి చేసేవారు. ఆయన చివరగా 2021లో వచ్చిన 'ఎన్నంగ సర్ ఉంగ సట్టం' సినిమాలో కనిపించారు.
చదవండి: ఓటీటీలో ఏకంగా 28 సినిమాలు, సిరీస్‌లు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment