
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. జానపద పాటలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న గాయని రమణి అమ్మాల్(69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన రమణి అమ్మాల్.. రాక్‌స్టార్ రమణిగా ఫేమస్ అయ్యారు.
భరత్ హీరోగా నటించిన కాదల్ చిత్రంలోని తండట్టి కుప్పాయి పాట రమణికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆ పాట సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు లభించాయి. 2017లో జీ తమిళ్ సరిగమపలో పాల్గొని మరింత ఫేమస్ అయింది.
అయితే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించినప్పటికీ.. ఆమె ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. చనిపోయే ముందు వరకు కూడా ఇండ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నట్లు తెలుస్తోంది. ఇక రమణి అమెరికా, సింగపూర్, శ్రీలంక దేశాల్లో అనే స్టేజీ షోలలో ప్రదర్శనలు ఇచ్చింది. ఒక తమిళ్ సీరియ్‌ల్లో కూడా నటించింది. రమణి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment