Chennai Elections: Vijay Thalapathy Apologizes To Public For Creating Inconvenience Video Viral - Sakshi
Sakshi News home page

Vijay : విజయ్‌ సింప్లిసిటికి నెటిజన్లు ఫిదా, వీడియో వైరల్‌

Published Sat, Feb 19 2022 1:07 PM | Last Updated on Sat, Feb 19 2022 3:09 PM

Thalapthy Vijay Apologised To The Public For Creating Inconvenience - Sakshi

Thalapthy Vijay Apologised To The Public: చెన్నైలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోలీవుడ్‌ స్టార్‌, తలపతి విజయ్‌ సైతం తన ఓటును వినియోగించుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన విజయ్‌ ఫోటోలు తీసేందుకు మీడియా పెద్ద ఎత్తున గుంపులుగా చేరడంతో అక్కడ ఉన్న సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగింది.

పరిస్థితిని గమనించిన విజయ్‌ తనవల్ల జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. విజయ్‌ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ఈ ఎన్నికల్లో దళపతి అభిమానులు కూడా పోటీ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement