అల్లు అర్జున్ పుష్ప-2 నిరీక్షణకు మరో రోజులోనే తెరపడనుంది. డిసెంబర్ 4 రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ బెనిఫిట్ షోలు మొదలు కానున్నాయి. దీంతో ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్ పేరే వినిపిస్తోంది. పుష్ప డైలాగ్స్‌తో ఇమిటేట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తగ్గేదేలే అంటూ పోస్టులు పెడుతున్నారు.
అయితే ఇంతలా హంగామా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్, సినీప్రియులు చేస్తారని అందరికీ తెలుసు. కానీ సినీతారలు కూడా పుష్ప-2 కోసం వెయిట్ చేస్తున్నారంటే ఐకాన్ స్టార్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. తాజాగా పుష్ప-2 విడుదల సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో పుష్ప డైలాగ్‌తో అదరగొట్టింది ముద్దుగుమ్మ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అంటూ డైలాగ్ మేనరిజం చేస్తూ కనిపించింది. ఈ సందర్భంగా పుష్ప-2 చిత్రబృందానికి బెస్ విషెస్ చెప్పింది. ఈ మాస్టర్ పీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment