ప్రత్యేక మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్ మ్యాక్స్ జూన్ నెల 2020కు సంబంధించి టాలీవుడ్ టాప్ 10 లవింగ్ యాక్టర్స్ జాబితను ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ జాబితాలో టాప్ 1లో ప్రిన్స్ మహేష్ బాబు నిలవగా ఆ తర్వాత స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి వరుస స్థానాలను దక్కించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, నాచురల్ స్టార్ నాని, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ టాప్ 10 జాబితాలో ఉన్నారు. ఇక ఈ జాబితాలో విజయ్‌దేవర కొండ, విక్టరీ వెంకటేష్ టాప్-9, టాప్-10 స్థానాల్లో నిలిచారు. గత నెలలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలవగా, ప్రిన్స్ రెండో స్థానంలో నిలిచారు.
Ormax Stars India Loves (Telugu): Top 10 male stars in Telugu cinema (June 2020) #OrmaxSIL #OSILTelugu pic.twitter.com/aIpWqRZDGK
— Ormax Media (@OrmaxMedia) July 26, 2020
చదవండి: బీపీ మాత్రలు మింగిన నటి , పరిస్థితి విషమం!
ఆర్‌మ్యాక్స్ గత ఎనిమిదేళ్లుగా సినిమాలు, సీరియల్స్‌కు ఇంక ఇతర ట్రెండ్ విషయాలకు సంబంధించిన వ్యూవర్ షిప్, బాక్సాఫీస్ కలెక్షన్స్, ఇంకా ఇతర విషయాలను తెలియజేస్తోంది. ఇవే కాకుండా వాటికి సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తోంది. చదవండి: ధ్రువ సర్జా, రష్మికా ‘పొగరు’
Comments
Please login to add a commentAdd a comment