
సోసైటీలో అన్ని రంగాల్లో లేడీస్....జెంట్స్ తో సమానంగా ట్రాన్స్ జెండర్స్ కూడా రాణిస్తున్నారు. ఇన్ సెక్యూరిటీతో నలుగురిలోకి రాకుండా ఆగిపోవటం లేదు. తమకి నచ్చిన రంగంలో రాణించేందుకు కృషి చేస్తున్నారు. అలా ధాయ్ లాండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రాన్స్ జెండర్ పోయిడ్ ట్రిచాడ స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకుంది. 36 ఏళ్ల ట్రిచాడ హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తూనే మోడలింగ్ రంగంలో కూడా మంచి గుర్తింపు పొందారు. తాజాగా ఈ బ్యూటీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పుకెట్ ప్రావిన్స్ కు చెందిన బడా బిజినెస్ మ్యాన్ ఓక్ భవఘా హాంగ్యోక్ తో మార్చి 1 పోయిడ్ ట్రిచాడ పెళ్లి జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పోయిడ్ తన మ్యారేజ్ పోటోస్ షేర్ చేసింది. అంతేకాదు ఇప్పుడు మేమిద్దరం అఫిషియల్ గా భార్య భర్తలం అంటూ పోయిడ్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. నెట్టింట ఈ పోస్ట్ తో పాటు.. ఈజంట పోటోలు వైరల్ గా మారాయి.
ట్రిచాడ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె ఇన్ స్టాలో దాదాపు 26లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిజానికి ట్రిచాడ పుట్టుకతోనే అబ్బాయిగా జన్మించింది...థాయ్ లాండ్ లోని ఫెంగ్ నాలో 1986 అక్టోబర్ 5న జన్మించిన పోయిడ్ ట్రిచాడ పెరిగే కొద్ది తనలో అమ్మాయిల లక్షణాలు ఉన్నాయని గుర్తించాడు. పదిహేడేళ్ల వయస్సు వచ్చే వరకు అబ్బాయిగా జీవించినా... ఆ తర్వాత ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ తో అమ్మాయిగా మారిపోయింది. ఆ తర్వాత పోయిడ్ తనకి నచ్చిన మోడలింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేసింది.
అలాగే 2004లో ట్రాన్స్ జెండర్స్ కోసం నిర్వహించే మిస్ టిఫ్ఫనీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది.. అదే సంవత్సరం మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ కీరిటం కూడా దక్కించుకుంది. మోడలింగ్ ఫీల్డ్ లో మంచి పాపులారిటీ తోపాటు క్రేజ్ తెచ్చుకున్న ఈ ట్రాన్స్ జెండర్ బ్యూటీకి థాయ్ లాండ్ లోని సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 2010 లో విత్ లవ్ మూవీతో పోయిడ్ తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా తర్వాత స్పైసీ బ్యూటీ క్వీన్ ఆఫ్ బ్యాంకాక్ 2 లో నటించి ప్రశంసలు అందుకుంది. పోయిడ్ హాంకాంగ్ మూవీస్ ది వైట్ స్టామ్..ఫ్రమ్ వెగాస్ టు మకాన్...విచ్ డాక్టర్ లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment