TV Actress Ashmita Karnani Shares Her Home Tour Video - Sakshi
Sakshi News home page

Ashmita karnani: ప్రముఖ సీరియల్‌ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో!

Published Fri, May 13 2022 6:37 PM | Last Updated on Fri, May 13 2022 7:24 PM

TV Actress Ashmita karnani Shares Her Home Tour Video - Sakshi

అష్మిత కర్ణని.. తెలుగు సీరియల్స్‌ చూసేవారికి ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో పాపులర్‌ సీరియల్స్‌లో నటించిందీవిడ. దాదాపు 15కు పైగా ధారావాహికల్లో నటించిన అష్మిత అడపాదడపా సినిమాలు కూడా చేసింది. కొరియోగ్రాఫర్‌ సుధీర్‌ను పెళ్లి చేసుకున్న ఆమె భర్తతో కలిసి ఇస్మార్ట్‌ జోడీ అనే షోలోనూ పాల్గొంది. ఇక​ 2020 మేలో యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పిన అష్మిత సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె తన హోమ్‌ టూర్‌ వీడియో షేర్‌ చేసింది. 

ఇందులో తన ఇంటీరియర్‌ డిజైన్‌ చూపిస్తూ ఇల్లంతా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉండేలా జాగ్రత్త పడ్డామంది. తక్కువ స్థలాన్నే అందంగా తీర్చిదిద్ది లగ్జరీ ఇంటిగా మార్చుకున్నామని తెలిపింది. డైనింగ్‌ టేబుల్‌, కుర్చీలు బయట ఎక్కడా కొనుక్కోలేదని తమ కోసం సెపరేట్‌గా తయారు చేయించుకున్నామని చెప్పింది.

ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కిచెన్‌ను మూసేందుకు వీలుగా ఒక స్లైడింగ్‌ బోర్డ్‌ చేయించుకున్నామంటూ దానిని చూపించింది. ఇంటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు మూలల్లో మొక్కలను పెట్టామంది. హాల్‌, కిచెన్‌తో పాటు తనకో బెడ్‌రూమ్‌, తన భర్తకో బెడ్‌రూమ్‌ ఉందని ఆ గదులన్నీ చూపించింది. ఇక మరో చిన్న గదిలో హోమ్‌ థియేటర్‌ కూడా పెట్టుకున్నారు.

చదవండి: నరకం చూపించారు, బర్త్‌డే రోజే చంపేశారు: మోడల్‌ తల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement