చిరు బర్త్‌డే.. ఉపాసన ఎమోషనల్‌ ట్వీట్‌ | Upasana Konidela Wish To Chiranjeevi On His Birthday | Sakshi
Sakshi News home page

చిరు బర్త్‌డే.. ఉపాసన ఎమోషనల్‌ ట్వీట్‌

Published Sat, Aug 22 2020 1:25 PM | Last Updated on Sat, Aug 22 2020 3:34 PM

Upasana Konidela Wish To Chiranjeevi On His Birthday - Sakshi

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు(ఆగస్ట్‌ 22) సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. కరోనా నేపథ్యంలో బహిరంగంగా వేడుకలు నిర్వహించనప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా అభిమాన హీరోకి మెగా ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరిలో మెగా హీరోలు అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరణ్‌ సందేష్‌లు కూడా ఉన్నారు. వీరంతా ట్విటర్‌ వేదికగా చిరుతో కలిసి దిగిన ఫోటోలు షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెష్‌ తెలియజేశారు.
(చదవండి : చిరు బర్త్‌డే: ఫ్యాన్స్‌కు మెగా డాటర్‌ స్పెషల్‌ గిఫ్ట్‌ )

ఇక చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కోడలు, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. ‘నిత్య కృషీవలుడు, గొప్ప నమ్మకం ఉన్న వ్యక్తి. దాయార్థ హృదయం, ఎలాంటి సమయంలోనైనా మానసిక ధైర్యంతో ఉండే వ్యక్తి ఆయన. అతన్ని నేను మామయ్య అని పిలిస్తే.. ప్రపంచం మెగాస్టార్‌ అని పిలుస్తోంది’ అని ఉపాసన ట్వీట్‌ చేస్తూ.. మీరంటే స్ఫూర్తి, ఆరాధనభావం ఎప్పటికి ఉంటుందంటూ తన మామయ్య చిరంజీవికి ఉపాసన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.(చదవండి : చిరు బర్త్‌డే : ప్రముఖుల శుభాకాంక్షలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement