Upasana Shares Care About Stem Cell Banking For Upcoming Baby, Deets Inside - Sakshi
Sakshi News home page

Upasana Konidela: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!

Published Wed, Jun 14 2023 10:20 AM | Last Updated on Wed, Jun 14 2023 2:40 PM

Upasana Shares Care About Stem Cell Banking For Upcoming Baby  - Sakshi

మెగా కోడలు ఉపాసన కొణిదెల త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 10 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం ధరించడంతో ఆ క్షణం కోసం మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సామాజిక సేవలోనూ ముందుండే ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు తన బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అయితే తాజాగా పుట్టబోయే బేబీ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 

(ఇది చదవండి: వెల్‌కమ్‌ టూ కొణిదెల ఫ్యామిలీ.. ఉపాసన ట్వీట్ వైరల్!)

బేబీ ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉపాసన వెల్లడించింది. అంతేకాకుండా బేబీ కార్డ్ బ్లడ్ బ్యాంక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో బేబీతో పాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసమే అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానం ఎంచుకున్నట్లు పేర్కొంది. తాజాగా ఊపాసన వీడియో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.   

అసలు స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏమిటి?

బొడ్డు తాడు దాచుకోవడం(స్టెమ్ సెల్ బ్యాంకింగ్)  గురించి చాలామందికి పెద్దగా తెలియదు. పిల్లలు పుట్టినప్పుడు బొడ్డు తాడు దాచడం వల్ల పెద్దయ్యాక వాళ్లకది బాగా ఉపయోగపడుతుంది. అది ఎన్నోరకాల చికిత్సలకోసం భవిష్యత్తులో వినియోగిస్తారు.  ఈ విషయంపై మనదేశంలో పెద్దగా అవగాహన లేదు. గతంలో మహేశ్ బాబు సతీమణి కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. తమ పిల్లలద్దరీ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. 

( ఇది చదవండి: వరుణ్‌ లావణ్య ఎంగేజ్‌మెంట్‌: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్‌ ఖరీదెంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement