వర్ష బొల్లమ్మ.. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. చూడటానికి చిన్నపిల్లలా క్యూట్‌గా కనిపించే ఈ బ్యూటీ ప్రస్తుతం ఊరుపేరు భైరవకోన సినిమా చేస్తోంది. ఈ మధ్యే ట్రైలర్ రిలీజవగా సినిమాపై ఉత్కంఠ పెంచుతోంది.
అమ్మ ఏడ్చేసింది..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది వర్ష. ఆమె మాట్లాడుతూ.. మా తల్లిదండ్రులు నన్ను మొదటి నుంచీ సపోర్ట్ చేస్తున్నారు. నటిగా నేను మెప్పించగలుగుతానని వారు నమ్మారు. నేను ఏం చేసినా సూపర్ అని పొగుడుతారు. అమ్మ నాతోపాటు షూట్‌కు వస్తుంటారు. ఏదైనా పెళ్లి సీన్‌లో నటించినప్పుడు అమ్మ ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, ఇది కేవలం షూటింగ్ అంతే.. నేనేమీ నిజంగా పెళ్లి చేసుకోవట్లేదు అని ఓదారుస్తూ ఉంటాను.
పెళ్లిపై ఏమందంటే?
అయినా తను ఎమోషనల్ అవుతూనే ఉంటుంది. మూడునాలుగేళ్లవరకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. ఒకప్పుడు హీరోయిన్లకు మంచి పాత్రలు దొరికేవి. వాటికి వెయిటేజీ, వాల్యూ ఉండేదని సుహాసిని అన్నారు. కానీ నేను ఈ మాటతో పూర్తిగా ఏకీభవించను. ఎందుకంటే మహిళా ప్రధానమైన సినిమాలు కూడా చాలా వస్తున్నాయి. అలా అని ఆమె అభిప్రాయాన్ని తప్పుపట్టడం లేదు అని చెప్పుకొచ్చింది.
చదవండి: క్రికెటర్‌తో రెండో పెళ్లి.. అప్పుడే పేరు మార్చేసుకుందిగా!
Comments
Please login to add a commentAdd a comment