Varsha Bollamma Respond On Wedding Rumours - Sakshi
Sakshi News home page

Varsha Bollamma: ఈ పెళ్లి విషయం ఇంట్లోవాళ్లకు చెప్తానన్న హీరోయిన్‌

Published Fri, Oct 28 2022 5:26 PM | Last Updated on Fri, Oct 28 2022 8:05 PM

Varsha Bollamma Responds On Wedding Rumours - Sakshi

బడా నిర్మాతతో కుర్ర హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ పెళ్లి అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు తెగ ఊరిస్తున్నాయి. త్వరలోనే వర్ష పెద్దింటి కోడలు కాబోతుందంటూ జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ ప్రచారానికి తెరదించిందీ హీరోయిన్‌. 'నాకోసం నాకే తెలియకుండా పెళ్లిచూపులు చేసి ఒక అబ్బాయిని సెలక్ట్‌ చేసినందుకు థ్యాంక్‌ యూ. ఆ అబ్బాయి ఎవరో నాకు చెప్తే నేను కూడా మా ఇంట్లో వాళ్లకి చెప్పేస్తా. ప్రస్తుతానికి నా పెళ్లి చూపులు చూడాలంటే ఆహాలో స్వాతిముత్యం చూడండి' అని ట్వీట్‌ చేసింది. దీనికి ఫేక్‌ న్యూస్‌ అన్న హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది.

అలా ఒక్క ట్వీట్‌తో తనకు పెళ్లి అంటూ వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టేసింది వర్ష. మరీ అంతగా తన పెళ్లిచూపులు చూడాలనుకుంటే తను కథానాయికగా నటించిన స్వాతిముత్యం చూసేయమని పనిలో పనిగా ప్రమోషన్‌ కూడా చేసేసింది. ఇక వర్ష ట్వీట్‌ చూసిన నెటిజన్లు.. 'నువ్వు ఒప్పుకుంటే ఆ అబద్ధాన్ని నిజం చేస్తా', 'నేను నిర్మాత కొడుకును కాదు కానీ నిన్ను బాగా చూసుకుంటా', 'నా దగ్గర నిర్మాత దగ్గర ఉండేంత డబ్బు లేదు కానీ నిర్మలమైన మనసు ఉంది' అంటూ ప్రపోజ్‌ చేస్తున్నారు.

చదవండి: తల్లి కాబోతున్న నిత్యామీనన్‌! పోస్ట్‌ వైరల్‌
హీరోయిన్‌ మీద ప్రేమను బయటపెట్టిన హీరో సిద్దార్థ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement