లావణ్యకు కాల్ చేయను.. ఎందుకంటే.. వరుణ్ తేజ్ క్రేజీ ఆన్సర్! | Varun Tej Crazy Answers At Gandeevadhari Arjuna Movie Pre Release Event, Deets Inside - Sakshi
Sakshi News home page

Varun Tej: నిహారికే ఫస్ట్ ఛాయిస్.. వరుణ్ తేజ్ ఆసక్తికర సమాధానం?

Published Tue, Aug 22 2023 9:15 PM | Last Updated on Wed, Aug 23 2023 9:28 AM

Varun Tej Crazy Answers At Gandeevadhari Arjuna Pre Release event - Sakshi

మెగా హీరో వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'గాండీవధారి అర్జున'. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయగా ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈవెంట్‌లో పాల్గొన్న యాంకర్‌గా వ్యవహరించిన సుమ కనకాల.. వరుణ్‌ తేజ్‌ను పలు ఆసక్తికర ప్రశ్నలు వేసింది. వాటికి వరుణ్ తేజ్ సైతం క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు. అవేంటో ఓ లుక్కేద్దాం. 

(ఇది చదవండి: మెగా ఇంట్లో పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!)


సుమ: చిరంజీవి, పవన్ కల్యాణ్‌లలో ఎవరీ మేనరిజం ఇమిటేట్ చేయడమంటే ఇష్టం?

వరుణ్ తేజ్: ఆ రెండు చూడటం చాలా ఇష్టం చేయడం కన్నా

సుమ: సాక్షివైద్య, ప్రవీణ్ సత్తారుతో పనిచేయడంలో ఎవరితో కంఫర్ట్‌ అనిపించింది?

వరుణ్ తేజ్: సాక్షివైద్య.. ప్రవీణ్ సత్తారు బాగా ఇబ్బంది పెట్టాడు.

సుమ: రామ్ చరణ్, అల్లు అర్జున్‌లో పెళ్లయిన తర్వాత ఎవరిలో మార్పు వచ్చింది?

వరుణ్ తేజ్:   పెళ్లయిన తర్వాత ఎవరిలోనైనా మార్పు రావాలి.

సుమ: నిహారిక, లావణ్య నుంచి కాల్ మీ అర్జెంట్ అని ఓకేసారి మేసేజ్ వస్తే ఎవరికీ ఫస్ట్ కాల్ చేస్తారు?

వరుణ్ తేజ్: ముందుగా నిహారికకే కాల్ చేస్తా.. ఎందుకంటే తను చిన్నపిల్ల కదా!

సుమ ప్రశ్నలకు వరుణ్ తేజ్‌ ఇచ్చిన సమాధానాలు విని ఫ్యాన్స్ సందడి చేశారు. కాగా.. ఇటీవలే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో వరుణ్-లావణ్యల పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఇంకా పెళ్లి తేదీలను వెల్లడించకపోయినప్పటికీ.. ఈ ఏడాదిలోనే ఉంటుందని ఇటీవల వరుణ్ తేజ్ చెప్పారు. ప్రస్తుతం గాండీవధారి అర్జున చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

(ఇది చదవండి: మీ మాటలు వింటే భయమేస్తోంది: కంగనా కామెంట్స్ వైరల్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement