Thalapathy Vijay's Vaarasudu movie crossed 150 crores across the world - Sakshi
Sakshi News home page

Vaarasudu Movie: వారసుడు కలెక్షన్ల సునామీ.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు

Published Tue, Jan 17 2023 3:06 PM | Last Updated on Tue, Jan 17 2023 3:32 PM

Vijay Vaarasudu Movie Crossed 150 Crores  Across The World - Sakshi

తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇటీవల చెన్నైలో చిత్ర యూనిట్‌ సక్సెస్ మీట్ కూడా‌ నిర్వహించింది.

ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల వసూళ్ల చేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. అలాగే ఓవర్‌సీస్‌లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటగా.. ఆస్ట్రేలియాలో 500 కె డాలర్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో విజయ్ డ్యాన్స్, పాటలు, కామెడీ, యాక్షన్‌తో కలర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement