Vijay Varma on Wanted Bride Ad, Netizens Funny Reactions - Sakshi
Sakshi News home page

Vijay Varma: వధువు కావలెను అంటూ పేపర్‌లో ప్రకటన.. తలపట్టుకున్న నటుడి తల్లి

Published Mon, May 15 2023 2:08 PM | Last Updated on Mon, May 15 2023 2:22 PM

Vijay Varma on Wanted Bride Ad, Netizens Funny Reactions - Sakshi

విజయ్‌ వర్మ.. ఇంతకుముందు ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలుసో లేదో కానీ తమన్నాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాక ఇక్కడివారికీ సుపరిచితుడయ్యాడు. ఇకపోతే అతడు ప్రధాన పాత్రలో నటించిన దహాద్‌ వెబ్‌ సిరీస్‌ మే 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సిరీస్‌ గురించి పేపర్‌లో ప్రకటన ఇచ్చింది చిత్రయూనిట్‌. ఇందులో ఇండియాలోనే నెంబర్‌ 1 బ్యాచిలర్‌ అంటూ విజయ్‌ వర్మ ఫోటో ఉంది. దాని కింద వధువు కావలెను అని రాసి ఉంది. అలాగే అబ్బాయి గురించి కొన్ని వివరాలను అక్కడ పొందుపర్చారు.

అయితే పేపర్‌లో ఈ యాడ్‌ చూసిన విజయ్‌ వర్మ తల్లి తల పట్టుకుంది. ఈ ఫోటోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. 'హ్యాపీ మదర్స్‌ డే అమ్మా.. క్యాంపెయిన్‌ బానే ఉంది కానీ ఈ వధువు కావలెను అన్న ప్రకటన గురించి అమ్మకు ఎలా వివరించి చెప్పాలి?' అంటూ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోను ట్యాగ్‌ చేశాడు. దీనిపై స్పందించిన ప్రైమ్‌.. 'మేము ఆమెకు సాయం చేయడానికే ప్రయత్నిస్తున్నాం' అని రిప్లై ఇచ్చింది. నెటిజన్లు మాత్రం 'అలా అంటావేంటి భయ్యా.. నీకు తమన్నా ఉందిగా!', 'టైం వేస్ట్‌ చేయకుండా అమ్మకు అసలు విషయం చెప్పేసి నీ కల నెరవేర్చుకో', 'వధువు కావలెను అంటావేంటి? నీ కోసం అక్కడ తమన్నా ఉంటే!' అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి విజయ్‌ పోస్ట్‌ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా తమన్నా, విజయ్‌ వర్మ డేటింగ్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! పలుమార్లు జంటగా కెమెరాలకు చిక్కడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఈ రూమర్స్‌పై ఇంతవరకు ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. దహాద్‌ వెబ్‌ సిరీస్‌ విషయానికి వస్తే విజయ్‌ వర్మ.. ఆనంద్‌ స్వర్నాకర్‌ అనే సీరియల్‌ కిల్లర్‌ పాత్రను పోషించాడు. సోనాక్షి సిన్హ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటించింది. గుల్షన్‌ దేవయ్య, సోహమ్‌ షా ముఖ్య పాత్రలు పోషించారు.

చదవండి: పెళ్లై 14 ఏళ్లు.. పిల్లలు లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్న నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement