
అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రజలను కోరుతున్నారు బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మెస్సీ. ముంబైలో నెలకొన్న కరోనా పరిస్థితులను ఉద్దేశించే ఆయన ఇలా అంటున్నారు. విక్రాంత్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘షూటింగ్ లొకేషన్స్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అయినా సరే నాకు కరోనా పాజిటివ్ అని తేలింది.
ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సినదిగా కోరుకుంటున్నాను. అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు రండి. లేకపోతే రావద్దు’’ అని పేర్కొన్నారు విక్రాంత్. ‘లవ్ హాస్టల్’ సినిమా షూటింగ్ సమయంలో విక్రాంత్‌కు కరోనా వచ్చిందని బాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. శంకర్ రామన్ డైరెక్ట్ చేస్తున్న ఈ హిందీ సినిమాలో విక్రాంత్ మెస్సీ, సాన్యా మల్హోత్రా, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment