Yashika Anand Quit Driving After Losing Her Friend In Road Accident - Sakshi
Sakshi News home page

Yashika Anand: నా ఫ్రెండ్‌ను నేనే చంపానంటున్నారు, అవును, నావల్లే: హీరోయిన్‌

Published Sat, Mar 12 2022 6:59 PM | Last Updated on Sat, Mar 12 2022 8:02 PM

Yashika Anand Quit Driving After Losing Friend In Accident - Sakshi

ఈ జన్మలో డ్రైవింగ్‌ జోలికి వెళ్లనంటోంది 'నోటా' హీరోయిన్‌, తమిళ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ యషికా ఆనంద్‌. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. గతేడాది యషికా, ఆమె స్నేహితురాలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు భవాని మరణించగా యషికా తీవ్రగాయాలతో బయటపడింది. కొంతకాలంపాటు మంచానికే పరిమితమైన యషికా ప్రస్తుతం కోలుకుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్‌చాట్‌ చేసింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌.. 'ఆ నీలిరంగు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ నీదేనా? ఇప్పటికీ నువ్వు దాన్ని వాడుతున్నావా?' అని అడిగాడు.

దీనికి యషికా స్పందిస్తూ.. 'అది నాదే కానీ, దాన్ని నా సోదరుడు వాడుతున్నాడు. నేను డ్రైవింగ్‌కు గుడ్‌బై చెప్పాను' అని బదులిచ్చింది. దీంతో కంగుతిన్న అభిమానుల్లో ఒకరు 'ఎందుకు డ్రైవింగ్‌ మానేశారు? డ్రైవ్‌ చేయడం అంటే మీకు ఇష్టం కదా?' అని అడిగాడు. దీంతో హీరోయిన్‌.. 'అవుననుకోండి. కానీ నా స్నేహితురాలిని నేనే చంపానని చాలామంది పదేపదే అంటున్నారు. అందుకే మంచి కోసమే దాన్ని మానేశాను' అని చెప్పింది. 'మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎలా చనిపోయింది?' అని మరో నెటిజన్‌ అడగ్గా.. 'ఎందుకంటే నేను చాలా ఫాస్ట్‌గా కారు నడిపాను' అని బాధతో రిప్లై ఇచ్చింది యషికా.

చదవండి: షారుక్‌ నుంచి దూరంగా వెళ్లిపోయా, కానీ.. : గౌరీ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement