ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోవాలి
ములుగు: ప్రభుత్వం మత్య్సకారులను ఆదుకోవాలని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సాదు రఘు కోరారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయకులు హాజరై జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మత్స్య సంపదపై కేవలం ముదిరాజ్‌లకు మాత్రమే చట్టపరమైన హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. చేపపిల్లల పంపిణీలో మధ్య దళారుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన 23మంది కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నాయకులు శానబోయిన వెంకటమల్ల య్య, పిట్టల వెంకటస్వామిరాజు, వెంకటేశ్వర్లు, సురేశ్, భరత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
ఏటూరునాగారం: మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ కల్పించి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని ముదిరాజ్ మహాసభ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఏటూరునాగారం మండల మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు చిటమట రఘు అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఆ సంఘం జెండాను రఘు గురువారం ఎగురవేసి మాట్లాడారు. ఏజెన్సీ మత్స్యకారుల హక్కులకు పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా నాయకులు భాస పుల్లయ్య, కులపెద్దలు నకిరబోయిన రమేష్, చింతకింది రాజు, గాడిచర్ల సాంబయ్య, పల్లబోయిన మొగిళి, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment