వెదురు మొక్క.. ఆదాయం పక్కా! | - | Sakshi
Sakshi News home page

వెదురు మొక్క.. ఆదాయం పక్కా!

Published Mon, Feb 24 2025 1:44 AM | Last Updated on Mon, Feb 24 2025 1:44 AM

వెదుర

వెదురు మొక్క.. ఆదాయం పక్కా!

వెయ్యి మంది ఎంపిక లక్ష్యం

వాజేడు

5,63810,297

వెంకటాపురం(కె)6,29110,713

వెంకటాపురం(ఎం) 6,83011,887

ములుగు10,70818,159

మంగపేట6,87411,303

గోవిందరావుపేట5,793

9,147

ఏటూరునాగారం5,560

9,657

మొత్తం55,410

94,187

ఏటూరునాగారం: జిల్లాలో పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఎస్‌) కింద వెదురు (కంకవనాల) పంట సాగుకు శ్రీకారం చుట్టాయి. నాలుగేళ్ల పంట తర్వాత ఒక్కో మహిళకు రూ.40 వేల నుంచి రూ.ఒక లక్ష వరకు ఆదాయం వచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు. ఉపాధి హామీ జాబ్‌కార్డు ఉండి పనికివెళ్లే కూలీలకు ఉచితంగా మొక్కలను అందజేసి వాటిని 15 గుంటల పట్టా భూమిలో సాగు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

ఒక్కో మహిళకు 60మొక్కలు

ఈ పథకం కింద ప్రభుత్వం ఒక్కో మహిళకు ఉచితంగా ఈజీఎస్‌ కింద 60 వెదురు మొక్కలను అందిస్తారు. వాటిని పెంచేందుకు ఒక్కో మొక్కకు రోజుకు రూ.15 వాచ్‌ అండ్‌ వాటరింగ్‌ కింద అందజేస్తారు. ఇలా నాలుగేళ్లు పంట దిగుబడి వచ్చే వరకు అందజేసి ఆ తర్వాత ఎన్‌జీఓ లేదా ఇతర రాష్ట్రాల్లోని కంపెనీల ద్వారా ఆ వెదరుకు వచ్చిన వేర్లు, కంక కర్రలను కొనుగోలు చేయిస్తారు. ఈ పంట 40ఏళ్ల పాటు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పంటతో వచ్చే ఆదాయం పేదరిక నిర్మూలనకు దోహదపడడంతో పాటు మహిళల స్వావలంబనకు ఈ పథకం ఎంతో భరోసా ఇవ్వనుంది.

అవగాహన కల్పిస్తున్నాం..

పట్టా భూమి ఉన్న వారి కుటుంబాలకు, మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. కంకవనం పంట సాగు వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తున్నాం. నాలుగేళ్ల పంట తర్వాత ఆర్థికంగా అనేక లాభాలున్నాయి. మొక్కలను ఉచితంగా అందజేస్తాం. కంకవనం(వెదురు) పంటను కొనుగోలు చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తాం.

– చరణ్‌, ఈజీఎస్‌ ఏపీఓ, ఏటూరునాగారం

జిల్లాలో కంకవనం సాగుకు అధికారుల ప్రణాళికలు

నాలుగేళ్ల తర్వాత రూ.40 వేల నుంచి రూ.లక్ష ఆదాయం

15 గుంటల పట్టాభూమి ఉన్న ఉపాధి కూలీలు అర్హులు

ఈజీఎస్‌ ద్వారా ఉచితంగా మొక్కల పంపిణీ

పైలట్‌ ప్రాజెక్టు కింద మూడు మండలాలు ఎంపిక

జిల్లాలోని 15 గుంటల పట్టా భూమి ఉన్న వెయ్యి మంది మహిళలను ఎంపిక చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటగా పైలట్‌ మండలాలుగా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, ఎస్‌ఎస్‌తాడ్వాయి గుర్తించారు. ఆ గ్రామాల వారీగా ఈజీఎస్‌ అధికారులు కంకవనం మొక్కల పంట సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. మొక్కలు నాటే విధానంతో పాటు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పట్టా భూమి ఉన్న మహిళలు పేర్లను గ్రామ పంచాయతీల్లో నమోదు చేసుకోవాలని అధికారులు టంకా వేయించారు. వ్యవసాయ భూములు ఉన్న మహిళల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వెదురు మొక్క.. ఆదాయం పక్కా!1
1/1

వెదురు మొక్క.. ఆదాయం పక్కా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement