కరకట్ట ఎత్తు పెంచడంలో ప్రభుత్వం విఫలం
ఏటూరునాగారం: గోదావరి కరకట్ట ఎత్తు పెంచడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గండేపల్లి సత్యం అన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు చక్రవర్తి ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం వరకు ఉన్న గోదావరి కరకట్ట శిథిలమైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సత్యం మాట్లాడుతూ 20ఏళ్ల క్రితం గోదావరి జంపన్నవాగు వరద నీరు గ్రామంలోకి వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం వరకు కరకట్ట నిర్మాణం చేపట్టిందన్నారు. క్రమంగా అది కొట్టుకుపోవడం దానికి తోడు కరకట్ట పక్కనే ఇసుక క్వారీలు ఏర్పాటు చేయడంత్లో కరకట్ట పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి సీఎం కేసీఆర్ 2022లో కరకట్టను పరిశీలించి ఎత్తు పెంచుతామని హామీ ఇచ్చి మరిచారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జియోట్యూబ్స్ వేయడానికి రూ.70లక్షలు కేటాయించిందని తెలిపారు. కానీ గతంలో మరమ్మతుల కోసం రూ.6.5లక్షలు ఖర్చు చేసిన అధికారులు అప్పటి వరకే తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకున్నారని వివరించారు. రానున్న వర్షాకాలం నాటికై నా కరకట్ట ఎత్తు పెంచితే గ్రామాల్లోకి వరదలు రాకుండా ఉంటాయని తెలిపారు.
బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యం
Comments
Please login to add a commentAdd a comment