మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26నుంచి 28 వరకు నిర్వహిచనున్న ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంత్రి ఆదివారం సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. రామప్పలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. రామప్పకు అదనపు బస్సులు, పారిశుద్ధ్యం, పార్కింగ్, తాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్‌ల ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం వంటి వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. భక్తుల కోసం 26న రాత్రి 10గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రామప్పలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. అనంతరం రామప్ప సందర్శనకు వచ్చిన పర్యాటకులతో సీతక్క సెల్ఫీలు దిగడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, కాంగ్రెస్ నాయకులు చెన్నోజు సూర్యనారాయణ, మిల్కూరి అయిలయ్య, బైరెడ్డి భగవాన్‌రెడ్డి, బండి శ్రీనివాస్, జంగిలి రవి పాల్గొన్నారు.
సేవాలాల్ జయంతికి హాజరుకావాలని ఆహ్వానం
ములుగు/ఏటూరునాగారం: ఈ నెల 28న జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవానికి హాజరుకావాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం మంత్రి సీతక్కను క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. మంత్రిని కలిసిన వారిలో సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్లు పోరిక సర్వన్‌కుమార్, జయరాం, సీనియర్ సభ్యులు పోరిక మోహన్‌లాల్, కోశాధికారులు సునీల్‌కుమార్, జరుపుల బాలునాయక్, ప్రచార కార్యదర్శులు పాడ్య కుమార్, పోరిక రాహుల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క
మంత్రిని సన్మానించిన శివాలయ కమిటీ
ఏటూరునాగారం మండల కేంద్రంలోని శ్రీ ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 26న శివపార్వతుల కల్యాణం(శివరాత్రి) వేడుకలకు రావాలని ఆలయ కమిటీ చైర్మన్ మడుగూరి ప్రసాద్ మంత్రి సీతక్కను కోరారు. మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డుకు వచ్చిన మంత్రిని కమిటీ చైర్మన్‌తో పాటు నాయకులు, డైరెక్టర్లు కలిసి మంత్రిని సన్మానించి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇర్సవడ్ల వెంకన్న, గుడ్ల దేవేందర్, ఎర్రబెల్లి మనోజ్, వావిలాల ఎల్లయ్య, సర్వ అక్షిత్, సరికొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment