గొత్తికోయలను మోసం చేసిన అటవీశాఖ అధికారి
ఏటూరునాగారం: గొత్తికోయల భూమిని వేరొకరి వద్ద డబ్బులు తీసుకుని వారిపేరు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాకు ఎక్కించి పోడు భూముల సర్వే బీట్ ఆఫీసర్ మోసం చేశారని రాయిబంధం గ్రామ పెద్దలు పథం జోగయ్య, కిశోర్, వడ్కాపురం సారయ్యలు ఆరోపించారు. మండల కేంద్రంలో ఆదివారం గ్రామ పెద్దలు, బాధితులు విలేకర్లకు వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి పరిధిలో గల రాయిబంధం గ్రామ శివారులో 25ఏళ్లుగా కాస్తులో పథం పొజ్జయ్య, మడకం సమ్మయ్య, కత్మా గంగయ్య తమకున్న నాలుగు ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో 2023లో పోడు భూముల సర్వే బీట్ ఆఫీసర్ రాజేష్ పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన గిరిజన మహిళ కబ్బాక నీలమ్మ వద్ద డబ్బులు తీసుకుని గొత్తికోయలకు చెందిన భూమిని ఆమె పేరుపై ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాకు ఎక్కించారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధిత రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రభాకర్ ఎంపిక
ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆదివాసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటే రవి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొమురం ప్రభాకర్‌ను ఎంపిక చేసి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, పొదెం కృష్ణప్రసాద్, వీరయ్య, మంకిడి రవి, భాస్కర్, చందా మహేష్ తదితరులు పాల్గొన్నారు.
13 ఇసుక లారీలు సీజ్
ఏటూరునాగారం: మండల పరిధిలోని చిన్నబోయిన్నపల్లి వేబ్రిడ్జి వద్ద వాహనాలను ఆదివారం తనిఖీ చేస్తుండగా అధిక లోడుతో వెళ్తున్న 13ఇసుక లారీలను సీజ్ చేసినట్లు ఎస్సై తాజొద్దీన్ తెలిపారు. ఎస్పీ శబరీశ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు, సీఐ శ్రీనివాస్ సూచనలతో వాహనాలు తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వీరాపురం ఇసుక రీచ్ నుంచి వస్తున్న 13ఇసుక లారీలను పరిశీలించినట్లు తెలిపారు. ప్రతీ లారీలో టన్నున్నర ఇసుక అధికంగా ఉండడంతో వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.
అసత్య ఆరోపణలు
వెనక్కి తీసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: సీఎంపీఎఫ్ అక్రమాలపై బీఎంఎస్ నాయకులు చేసిన అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసునూటి రాజేందర్ డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆసమయంలో సీఎంపీఎఫ్ అక్రమాలు జరిగినట్లు తెలిపారు. అవగహన లేకుండా యూపీఏ హయంలో అక్రమాలు జరిగాయని బీఎంఎస్ నాయకులు ఆరోపణలు చేయడం తగదన్నారు. సమావేశంలో నాయకులు రాజయ్య, రమేశ్ పాల్గొన్నారు.
మార్చి 4 నుంచి
కేయూ ఎంబీఏ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. మార్చి 4, 6,11, 13, 17, 19, 21 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌లో చూడవచ్చునని సూచించారు.
గొత్తికోయలను మోసం చేసిన అటవీశాఖ అధికారి
గొత్తికోయలను మోసం చేసిన అటవీశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment