గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: గురుకుల ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11గంటల నుంచి ఒంటిగంట వరకు పరీక్షను నిర్వహించారు. ఏటూరునాగారం మండలకేంద్రంలో 349మందికి 343మంది పరీక్షకు హాజరైనట్లు ఏటూరునాగారం గురుకుల క్రీడా పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష గదిలోకి పంపించినట్లు వెల్లడించారు. అదే విధంగా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి కలిసి ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లలో చేరుకున్నారు. పరీక్ష సమయంలో హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డు చూపించాలని మొదట కోరగా విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకురాలేదని తెలపడంతో సెంటర్‌లోకి అనుమతించారు. 172 మంది విద్యార్ధులకు 151 మంది మాత్రమే హాజరయ్యారు.
గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం
Comments
Please login to add a commentAdd a comment