రేషన్ దందా!
రూటు మారిన
అటవీమార్గం గుండా బియ్యం తరలింపు
గోవిందరావుపేట: అధికారులు, పాలకుల అండతో రేషన్ బియ్యం మాఫియా చెలరేగుతోంది. పేదల క డుపు నింపేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేష న్ బియ్యాన్ని అక్రమార్కులు అటవీమార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా గోవిందరావుపేట మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో రూ.13 లక్షల విలువ చేసే సుమారు 625 క్వింటాళ్ల బియ్యాన్ని పస్రా పోలీసులు పట్టుకున్నారు. మొద్దులగూడెంలో పస్రా ఎస్సై కమలాకర్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా లారీపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా రేషన్ బియ్యం కనిపించాయి. పోలీసుల విచారణలో బియ్యాన్ని నాగపూర్‌కు తరలిస్తున్నట్లుగా తేలింది. ఇలా రూటు మార్చి అటవీ మార్గం మీదుగా పొరుగు రాష్ట్రాలకు లారీల్లో రేషన్ బియ్యం తరలిస్తున్నారు. అడపాదడపా పోలీసుల తనిఖీల్లో అక్రమ వ్యాపారం బయటపడుతుంది. అయినా సంబంధిత శాఖ అధికారులు మాత్రం ప ట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.
అటవీ మార్గం ద్వారా తరలింపు..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి ఇల్లందు, గుండాల మీదుగా మండలంలోని లింగాల, కొడిశాల, మొద్దులగూడెం గ్రామాల మీదుగా జాతీయ రహదారికి రావడానికి దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సూత్రదారులు ఆసరా చేసుకొని నాగ్‌పూర్‌కి తరలిస్తున్నారు. ఈ దారి మొత్తం అటవీ ప్రాంతంతో నిండి ఉంటుంది. చెకింగ్‌లు, పోలీస్ పెట్రోలింగ్‌లు తక్కువగా ఉండటంతో దళారులు ఈ మార్గం ద్వారానే బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలస్తుంది.
దొరికితే దొంగలు..లేదంటే దొరలు..
గత కొంత కాలంగా సాగుతున్న రేషన్ మాఫియాలో ప్రతీనెల టన్నుల కొద్ది బియ్యం పక్కదారి పడు తున్నాయి. ఈ బియ్యం తరలింపు అడ్డుకునేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రత్యేక అధికారులకు, పోలీసులకు అధికారం ఉన్న గోప్యంగా దందా సాగుతుంది. అక్రమార్కులు దొరికితే దొంగలు.. లేదంటే లక్షల సంపాదనతో దొరలు అన్న చందంగా పరిస్థితి మారింది. మండలంలోని కొంతమంది బియ్యం దళారులు, రేషన్ డీలర్లు కుమ్మకై ్క దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మొద్దులగూడెంలో డంప్ చేసి..
రేషన్ బియ్యం ఎగుమతిపై పస్రా పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల రెండు లారీలను పట్టుకోవడమే అందుకు నిదర్శనం. గోవిందరావుపేట, తాడ్వాయి మండలాలకు చుట్టూ పక్కల తండాలు, పల్లెలు అధిక సంఖ్యలో ఉండడం, వీటన్నింటికి మొద్దులగూడెం గ్రామం కేంద్రంగా డంప్ చేయడం అక్కడి నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా పీడీఎ స్ బియ్యాన్ని పట్టుకుంటున్నారు. అయితే ప ట్టుబడిన నిందితులు మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల నుంచి ఎగుమతి చేస్తున్నామని చెబుతుండటంతో అసలైన సూత్రదారులు ఎవరనేది క్లారిటీ రాకపోవడం శోచనీయం. దళారులు వివిధ గ్రామాల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి ఒక దగ్గర డంప్ చేసి లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం.
మహబూబాబాద్ టు నాగ్‌పూర్
వయా పస్రా
దళారులతో రేషన్ డీలర్ల కుమ్మక్కు
పట్టించుకోని సంబంధిత శాఖ
అధికారులు
నిఘా పెంచిన పస్రా పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment