పగిడిద్దరాజు జాతర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి
ఎస్‌ఎస్ తాడ్వాయి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డలో మార్చి 5 నుంచి 8వ తేదీ వరకు ఆరెం వంశీయుల ఆధ్వర్యంలో జరిగే పగిడిద్దరాజు జాతరను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆరెం వంశీయుల ఆధ్వర్యంలో జరిగే పగిడిద్దరాజు జాతరకు రావాలని మేడారం జాతర కమిటీ చైర్మన్ ఆరెం లచ్చుపటేల్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మాజీ సర్పంచ్ ఇర్ప సునిల్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, నాయకులు తాండాల శ్రీనివాస్, అశాడపు మల్లయ్య, ఎనుగంటి నరేష్, తదితరులు పాల్గొన్నారు.
నిలిచిన పత్తి కొనుగోళ్లు
ములుగు: జిల్లాలో పత్తి కొనుగోలు నిలిపేసినట్లు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) ఆర్.శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాలతో పత్తి కొనుగోలు నిలిపేశామని, తిరిగి ఈ నెల 28వ తేదీ నుంచి కొనుగోలు చేస్తామన్నారు.
అంగన్‌వాడీ టీచర్ యూనియన్ రాష్ట్ర
ఉపాధ్యక్షురాలిగా సమ్మక్క●
ములుగు రూరల్: తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కె. సమ్మక్క ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో జరిగిన యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు సమ్మక్క కృతజ్ఞతలు తెలిపారు.
సున్నం బట్టి వీధిలో చోరీ
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని సున్నం బట్టి వీధిలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..సున్నం బట్టి వీధికి చెందిన కృష్ణ అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగల గొట్టి ఇంట్లో బీరువాలోని నల్లపూసల గొలుసు, బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదును చోరీ చేశారు. కృష్ణ కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం పనిమీద ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగిందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
పగిడిద్దరాజు జాతర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి
Comments
Please login to add a commentAdd a comment