ఎరుపెక్కిన ఏనుమాముల..
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం మిర్చితో ఎరుపెక్కింది. రైతులు భారీ మొత్తంలో మిర్చిని తీసుకొచ్చారు.
– 8లోu
మహాశివరాత్రి సందర్భంగా రామప్పను సందర్శించే భక్తులకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించా రు. రామలింగేశ్వరస్వామిని దర్శించుకునే సాధారణ భక్తులకు, స్వామివారికి అభిషేకాలు నిర్వహించే భక్తులకు వేర్వేరుగా క్యూలైన్లలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. రామప్ప ఆలయం చుట్టూ, గార్డెన్‌లో, పార్కింగ్ ప్రదేశాల్లో సుమారు 200 ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ ఆరు సీసీ కెమెరాలను ఏ ర్పాటు చేశారు. ట్రాన్స్‌కో ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రమేశ్, సబ్ ఇంజనీర్ సాంబరాజు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిరంతర విద్యుత్ కోసం ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ కనెక్షన్లను ఇచ్చారు. డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో ఎస్సై జక్కుల సతీష్ సిబ్బందితో కలిసి పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. 300 మంది పోలీసు సిబ్బందితో బందో బస్తు నిర్వహించనున్నారు. డీపీఓ ఓంటేరు దేవరా జు ఆధ్వర్యంలో ఎంపీఓ శ్రీనివాస్‌తో పాటు పంచా యతీ కార్యదర్శులు రామప్పలో పర్యటిస్తూ శానిటేషన్ పనులు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, డాక్టర్ శ్రీకాంత్‌లు తెలిపారు. 26 నుంచి 28వ తేదీ వరకు ములుగు, హనుమకొండ, పరకాల ప్రాంతాల నుంచి రామప్పకు ఆర్టీసీ బస్సులు నడిపించనున్నారు.
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత, ఎండ ఎక్కువగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.
భక్తులకు సకల సౌకర్యాలు
ఎరుపెక్కిన ఏనుమాముల..
Comments
Please login to add a commentAdd a comment