మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన ఆలయం
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపద కలిగిన రామప్ప దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడురోజుల పాటు జరిగే మహోత్సవాలకు రామప్ప సిద్ధమైంది. కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఎస్పీ శబరీష్, డీఎస్పీ రవీందర్‌లు ఎప్పటికప్పుడు రామప్పలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రామప్ప ఆలయ తూర్పు ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి వరదలతో కొట్టుకుపోయిన రోడ్డుపై గ్రావెల్ పోసి వినియోగంలోకి తెచ్చారు. రామప్పను సందర్శించే వీఐపీలతో పాటు రామప్పలో విధులు నిర్వహించే ఉద్యోగులను తూర్పుముఖద్వారం నుంచి అనుమతించనున్నారు. బుధవారం రాత్రి 10గంటలకు వైభవంగా శివపార్వతుల కల్యాణాన్ని ఆలయ అర్చకులు కోమళ్లపల్లి హరీష్‌శర్మ, ఉమాశంకర్‌లు నిర్వహించనున్నారు. శివపార్వతుల కల్యాణాన్ని తిలకించేందుకు సుమారు 60 వేల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment