ఆదివాసీగూడేల్లో మౌలిక వసతులు కల్పించాలి
ములుగు రూరల్: జిల్లాలోని వలస ఆదివాసీగూడేల్లో మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేష్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట వలస ఆదివాసీలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 సంవత్సరాలుగా వలస ఆదివాసీలు 68 గూడాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారన్నారు. నివాస ప్రాంతాల్లో కరెంటు, మంచి నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతి పంపులు నీరు ఫ్లోరైడ్ కారణంగా తాగడానికి వీలులేకుండా ఉన్నాయన్నారు. వన్యప్రాణాలు సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు ఆదివాసీలను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుగ్గి చిరంజీవి, శోభన్, చంటి, దేవయ్య, సోమేష్, దేవేందర్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment