బుధవారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వాజేడు: విద్యుత్ దీపాల వెలుగులో ప్రగళ్లపల్లిలోని శివాలయం
రామప్ప దేవాలయం
జిల్లాలో మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని శైవ క్షేత్రాలను ముస్తాబు చేశారు. నేడు(బుధవారం) భక్తులు తరలివచ్చి పరమశివుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ మేరకు పలు ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. అదే విధంగా నేటి నుంచి జరిగే ఉత్సవాలకు ముందే మంగళవారం పర్యాటకులు, విద్యార్థులు, భక్తులు అధికసంఖ్యలో రామప్పకు తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు హరీశ్ శర్మ, ఉమాశంకర్, రాజ్‌కుమార్‌లు పర్యాటకులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి బోటులో షికారు చేస్తూ సరస్సు అందాలను తిలకించారు. – వెంకటాపురం(ఎం)/వాజేడు
శైవక్షేత్రాలకు..
మహాశివరాత్రి శోభ
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
బుధవారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment