‘ఎమ్మెల్సీ’ పోలింగ్‌కు సర్వం సిద్ధం
ములుగు: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు జిల్లాలో ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 9 పోలింగ్ కేంద్రాలను 6రూట్లుగా విభజించారు. నాలుగు స్ట్రైకింగ్, రెండు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సును ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 628మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 27న ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే పోలింగ్ విధులకు హాజరయ్యే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నేడు పోలింగ్ అధికారులు, సిబ్బందికి సంబంధిత సామగ్రిని అందజేయనున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో బ్యాలెట్ బాక్సులతో సాయంత్రానికి అధికారులు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు.
పోలింగ్ కేంద్రాల వివరాలు
మండలం పోలింగ్ కేంద్రం ఓటర్లు
ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల 193
వెంకటాపురం(ఎం) జెడ్పీహెచ్‌ఎస్ 40
గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 108
ఎస్‌ఎస్‌తాడ్వాయి ఏహెచ్‌ఎస్ బాలికల పాఠశాల 65
ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్ 46
కన్నాయిగూడెం ఆశ్రమ పాఠశాల 19
మంగపేట జెడ్పీహెచ్‌ఎస్ 95
వాజేడు జెడ్పీ ఎస్‌ఎస్ పదోతరగతి గది 33
వెంకటాపురం(కె) జెడ్పీహెచ్‌ఎస్ 29
●
పోలింగ్ కేంద్రం పరిశీలన
మంగపేట: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సీఐ అనుముల శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్సై టీవీఆర్ సూరి ఉన్నారు.
జిల్లాలో 9 పోలింగ్ కేంద్రాలు.. 628 మంది ఓటర్లు
కలెక్టరేట్‌లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు
రేపు ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్
‘ఎమ్మెల్సీ’ పోలింగ్‌కు సర్వం సిద్ధం
‘ఎమ్మెల్సీ’ పోలింగ్‌కు సర్వం సిద్ధం
‘ఎమ్మెల్సీ’ పోలింగ్‌కు సర్వం సిద్ధం
‘ఎమ్మెల్సీ’ పోలింగ్‌కు సర్వం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment