ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
ములుగు రూరల్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాకారం ఆయుష్మాన్ మందిర్‌ను జాతీయ నాణ్యత ప్రమాణాల వర్చువల్ అసెస్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికేషన్ పొందడం వల్ల ఆరోగ్య కేంద్రంలో సదుపాయాలు, ప్రజలకు నాణ్యతతో కూడిన వైద్యం అందుతుందన్నారు. ఆయుష్మాన్ మందిర్‌లో సమన్వయంతో పనిచేస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్, జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణాధికారి పవన్‌కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రసాద్, వైద్యుడు నాగ అన్వేష్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment