చెక్‌డ్యామ్‌కు గండి
చిట్యాల/మొగుళ్లపల్లి: చిట్యాల మండలం నవాబుపేట, మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామాల మధ్య చలివాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌కు బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గండికొట్టారు. యాసంగికి ముందు చెక్ డ్యామ్ ఎండిపోయి దర్శనమిచ్చింది. పలుమార్లు సాగునీటి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కలిసి హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్ల నాగారం చెరువు నుంచి నీటిని విడుదల చేసి వరి పంటలను కాపాడాలని రైతులు విన్నవించారు. దీంతో ఎమ్మెల్యేలు ఇద్దరు స్పందించి వరి పంటల కోసం నీటిని విడుదల చేశారు. నీళ్లు కింది భాగానికి వెళ్లకపోవడంతో రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయని ఉద్దేశంతో చెక్ డ్యామ్‌కు గండి కొట్టినట్లు తెలుస్తుంది. చెక్‌డ్యామ్‌ను ఇరిగేషన్ డీఈ అమ్రపాలి. ఏఈలు వరుణ్ భాస్కర్‌లు సందర్శించి గండిని పరిశీలించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment