మిగిలింది అప్పులే..!
నల్లి పురుగుతో తగ్గిన మిర్చి దిగుబడి
జిల్లాలో మిర్చి సాగు వివరాలు
మండలం గతేడాది ప్రస్తుతం
ములుగు 2,637.01 2,076.18
వెంకటాపురం(ఎం) 1,650.71 1,210.10
గోవిందరావుపేట 23.26 23.20
ఎస్‌ఎస్‌తాడ్వాయి 174.52 60.73
ఏటూరునాగారం 1,525.76 1,252.00
కన్నాయిగూడెం 4,371.39 3,980.00
మంగపేట 3,636.39 2,959.00
వెంకటాపురం(కె) 5,039.32 4,383.00
వాజేడు 6,548.20 3,813.00
మొత్తం 25,606.56 19,757.20
ఖర్చు పెరిగింది.. ధర తగ్గింది..
గతేడాది 25గుంటల భూమిలో యశస్విని సీడ్ మిర్చి రకం సాగు చేశాను. దిగుబడి 16 క్వింటాలు వచ్చింది. పెట్టుబడి రూ.70 వేలు సాగుకు ఖర్చు చేశాను. మార్కెట్ ధర రూ.21 వేలు ఉండగా రూ.18 వేలకు పంటను అమ్మాను. ఈ ఏడాది ఎకరం 10గుంటల భూమిలో మిర్చి సాగు చేశాను. పెట్టుబడి ఇప్పటి వరకు రూ.2.10లక్షలు ఖర్చు చేశాను. ఈ ఏడాది మార్కెట్ ధర క్వింటా మిర్చికి రూ.13 వేలు ఉండగా 10క్వింటాలు అమ్మాను. ధర రూ.10,800మాత్రమే పలికింది. ధర పెరిగితే తప్పా పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
– బొంతల రాజుయాదవ్,
రైతు, ములుగు
మిగిలింది అప్పులే..!
Comments
Please login to add a commentAdd a comment